నా సినిమా అమ్మలకి అంకితం..వాళ్ళ కోసం ఎంత చేసినా తప్పు లేదు
on Apr 1, 2025
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan ram)లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi)తల్లి కొడుకులుగా చేస్తున్న చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'.ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri)దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ముప్ప వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్,అశోక్ వర్ధన్,సునీల్ నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఈ చిత్రం నుంచి 'చుక్కల చీర కట్టేసి' అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో తొలిసారిగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి అభిమానుల మధ్య సాంగ్ ని రిలీజ్ చేసారు.ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ తో పాటు చిత్ర బృందం పాల్గొంది.
ఈ సంధర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అతడొక్కడేలా 20 సంవత్సరాలు గుర్తిండిపోయే సినిమా అవుతుంది.అమ్మ క్యారక్టర్ ని విజయశాంతి ఒప్పుకోవడం వల్లే ఈ మూవీ చేయగలిగాం.అమ్మల్ని గౌరవించడం మన బాధ్యత.వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పు లేదు.అందుకే మా చిత్రాన్ని అమ్మలకి అంకితం ఇస్తున్నామని చెప్పుకొచ్చాడు.
కళ్యాణ్ రామ్ కి జోడిగా సాయి మంజ్రేకర్ జత కడుతుండగా సోహైల్ ఖాన్,శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు.ఇక 'చుక్కల చీర కట్టేసి' సాంగ్ అయితే ఫుల్ మాస్ బీట్ లో సాగి రేపు థియేటర్స్ లో అభిమానులు,ప్రేక్షకులు చేత విజిల్స్ వేయించేలా ఉంది. అంజనీష్ లోక్ నాద్(Ajaneesh LOknath)సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఆ సాంగ్ ని నకాష్ అజీజ్,సోనీ ఆలపించగా రఘురాం సాహిత్యాన్ని అందించాడు.కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ అయితే రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుపోతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
